Old Monk Rum: 170 ఏళ్ల ఓల్డ్ మంక్ చరిత్ర.. భారతదేశంలో నేటికీ దాన్ని మించిన రమ్ లేదు

భారతదేశంలో నేటికీ దాన్ని మించిన రమ్ లేదు

Update: 2025-11-26 10:55 GMT

Old Monk Rum: భారతదేశంలో చలికాలం మొదలవ్వగానే విస్కీ కంటే రమ్ తాగేవారి సంఖ్య పెరుగుతుంది. అలా చలిలో ఎక్కువ అమ్ముడయ్యే దేశంలో 170 ఏళ్లుగా తిరుగులేని ఆదరణ పొందుతున్న డార్క్ రమ్ బ్రాండ్ ఓల్డ్ మంక్. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారవుతుంది. దీని చరిత్ర 1855లో హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో ఎడ్వర్డ్ డయ్యర్ ఒక బ్రూవరీ స్థాపించడంతో మొదలైంది. కాలక్రమేణా ఇది మోహన్ మీకిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డిస్టిలరీగా మారింది. మోహన్ మీకిన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వేద్ రతన్ మోహన్ ఆధ్వర్యంలో 1960లలో ఓల్డ్ మంక్ పుట్టింది. బెనెడిక్టిన్ మంక్స్ (సన్యాసులు) జీవనం నుంచి ప్రేరణ పొంది ఈ పేరు పెట్టారు. ఇది త్వరలోనే దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తయారీ విదేశీ మద్యం బ్రాండ్‌గా ఎదిగింది.

ఓల్డ్ మంక్ 1855లో లాంచ్ అయినప్పటికీ ఇది 1960ల తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది వెనిలా రుచితో కూడిన డార్క్ రమ్. ఇందులో ఆల్కహాల్ శాతం 42.8% ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉత్పత్తి అవుతుంది. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వదు. దీని విజయం పూర్తిగా నోటి మాట, కస్టమర్ల నమ్మకంపైనే ఆధారపడింది. ఇది 90 ml నుంచి 1 లీటరు వరకు ఆరు వేర్వేరు సైజుల బాటిళ్లలో లభిస్తుంది. 2013లో ఇది ఎక్కువ అమ్ముడయ్యే డార్క్ రమ్ హోదాను కోల్పోయినప్పటికీ 2024లో మళ్లీ పుంజుకుంది. 2024లో ఓల్డ్ మంక్ ఏకంగా 1.3 కోట్ల కేసులను విక్రయించింది.

ఓల్డ్ మంక్ మాతృ సంస్థ అయిన మోహన్ మీకిన్ లిమిటెడ్ ఆర్థికంగా బలపడుతోంది. 2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య కంపెనీ అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,166.5 కోట్లుగా నమోదైంది. అలాగే నికర లాభం సుమారు రూ.102.6 కోట్లుగా ఉంది. కంపెనీ మెరుగైన ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై పట్టు సాధించడం, బలమైన కస్టమర్ డిమాండ్ కారణంగానే ఈ ఆదాయం విక్రయాలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News