PM Kisan : ప్రధాని మోదీ బంపర్ గిఫ్ట్..ఆ రైతులకు డబుల్ ధమాకా, ఒకేసారి రూ.4,000 జమ

ఆ రైతులకు డబుల్ ధమాకా, ఒకేసారి రూ.4,000 జమ

Update: 2026-02-06 08:07 GMT

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తదుపరి విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. గతేడాది నవంబర్ 19న 21వ విడత నిధులు విడుదలైన తర్వాత, ఇప్పుడు అందరి కళ్లు 22వ విడతపైనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి హోలీ పండుగ కంటే ముందే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

2026లో హోలీ పండుగ మార్చి 4న రానుంది. ఈ లోపే రైతుల చేతికి డబ్బులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా ఏటా మూడు విడతల్లో రూ.6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం అందిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 4వ తేదీ లోపు రైతుల ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున 22వ విడత నగదు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న కసరత్తులు చూస్తుంటే పండుగ ముందే నగదు వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆ రైతులకు రూ.4,000 ఎందుకు వస్తాయి?

ఈసారి కొందరు రైతులకు కేవలం రూ.2,000 మాత్రమే కాకుండా ఏకంగా రూ.4,000 లభించనున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. గతంలో అంటే 21వ విడత సమయంలో సాంకేతిక కారణాల వల్లనో లేదా ఆధార్ లింక్ కాకపోవడం వల్లే చాలా మంది రైతులకు డబ్బులు అందలేదు. అప్పుడు తప్పులు సరిదిద్దుకున్న వారికి, ఇప్పుడు రాబోయే 22వ విడతతో పాటు పాత బకాయి కలిపి ఒకేసారి రూ.4,000 అకౌంట్లోకి వస్తాయి. ఇది అర్హులైన రైతులకు పెద్ద ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు.

మీ పేరు లిస్టులో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

* డబ్బులు పడకముందే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవడం ఉత్తమం.

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)కు వెళ్లండి.

* అక్కడ హోమ్‌పేజీలో ఉన్న ఫార్మర్స్ కార్నర్(Farmers Corner) విభాగానికి వెళ్లండి.

* బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) పై క్లిక్ చేయండి.

* మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు చూడండి.

* అక్కడ మీ ఈ-కేవైసీ (e-KYC), ల్యాండ్ సీడింగ్ (Land Seeding) దగ్గర Yes అని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి.

ఈ తప్పు చేస్తే రూపాయి కూడా రాదు

పథకంలో పారదర్శకత కోసం కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అక్రమాలకు తావు లేకుండా కేవలం ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకే నేరుగా డబ్బులు పంపిస్తున్నారు. ఒకవేళ మీరు ఇంకా e-KYC పూర్తి చేయకపోయినా, లేదా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ లేకపోయినా ఈ విడత డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మీ స్టేటస్‌లో ఎక్కడైనా No అని కనిపిస్తే వెంటనే మీ దగ్గరలోని మీ-సేవా కేంద్రం లేదా బ్యాంకును సంప్రదించి ఆ తప్పులను సరిదిద్దుకోండి.

Tags:    

Similar News