PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత డబ్బుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా జమ చేస్తుంటారు. గతంలో 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయగా, ఇప్పుడు నాలుగు నెలలు పూర్తి కావస్తుండటంతో తదుపరి విడత ఎప్పుడు వస్తుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

దీపావళికి ముందే అందే అవకాశం

సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదలవుతుంటాయి. ఈ నియమం ప్రకారం 24వ విడత అక్టోబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. రాబోయే నవంబర్ 8న దీపావళి పండగ ఉండటంతో, పండగ కానుకగా కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి ఎలాంటి ఖచ్చితమైన తేదీ వెలువడలేదు. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ప్రచారాలను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ పనులు పూర్తి చేసుకోకపోతే డబ్బులు ఆగిపోవచ్చు

ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు డబ్బులు పడవు. మీ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.

* రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన వివరాలు సరిగ్గా ఉండాలి.

* ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలి.

* ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తై ఉండాలి.

* మీ బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. ఈ పత్రాలలో ఏది సరిగ్గా లేకపోయినా మీ విడత డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది.

మీ పేమెంట్ స్టేటస్ ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి

రైతులు డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే తమ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.

* హోమ్‌పేజీలో కనిపించే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

* మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

* 'Get OTP' పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

* వెంటనే మీ రిజిస్ట్రేషన్ వివరాలు అలాగే పేమెంట్ హిస్టరీకి సంబంధించిన పూర్తి సమాచారం స్క్రీన్ పై కనిపిస్తుంది.

Tags: