RBI : ఆర్బీఐ గుడ్ న్యూస్.. రూ.50లక్షల హోమ్ లోన్ పై ఇప్పుడు రూ.7.71లక్షలు ఆదా
రూ.50లక్షల హోమ్ లోన్ పై ఇప్పుడు రూ.7.71లక్షలు ఆదా;
RBI :దేశీయ గృహ రుణదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక శుభవార్త అందించింది. జూన్ 6న జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, హోమ్ లోన్ తీసుకున్న వారికి పెద్ద ఉపశమనం కల్పించింది. దీనికి ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కూడా ఆర్బిఐ రెపో రేటును 25-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మూడు కోతల వల్ల ఈ సంవత్సరం మొత్తం రెపో రేటులో 1 శాతం కోత నమోదైంది. ఎక్కువ మంది హోమ్ లోన్ తీసుకునేవారు ఫ్లోటింగ్ రేట్ రుణాలను ఎంచుకుంటారు. వీటి వడ్డీ రేట్లు రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల, రెపో రేటులో తగ్గుదల అంటే హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కూడా అదే విధంగా తగ్గుదల ఉంటుందని అర్థం.
హోమ్ లోన్లు రెపో రేటు తగ్గినప్పుడు, బ్యాంకులు రుణగ్రహీతలకు రెండు ఎంపికలను అందిస్తాయి
* EMI (ఈఎంఐ) తగ్గించుకోవడం: లోన్ కాలవ్యవధి (Tenure) లో ఎటువంటి మార్పు చేయకుండా నెలవారీ ఈఎంఐని తగ్గించుకోవడం.
* టెన్యూర్ తగ్గించుకోవడం: ఈఎంఐని అలాగే ఉంచుకుని, లోన్ కాలవ్యవధిని తగ్గించుకోవడం.
రుణగ్రహీత రెండు సందర్భాల్లోనూ వడ్డీపై పొదుపు చేసుకోవచ్చు. అయితే, పొదుపు అయ్యే మొత్తం రెండింటిలోనూ భిన్నంగా ఉంటుంది. వడ్డీ రేటు తగ్గిన తర్వాత మీరు మీ EMI ని తగ్గిస్తే, మీ EMI తగ్గడమే కాకుండా, మీరు చెల్లించే మొత్తం వడ్డీ కూడా గణనీయంగా తగ్గుతుంది.
అయితే, మీరు చేసుకునే ఆదా అనేది మీరు EMI ని తగ్గిస్తారా లేదా లోన్ కాలవ్యవధిని తగ్గిస్తారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు ఇప్పుడు మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తాయి కాబట్టి, ఈ కోత తర్వాత ఎంత పొదుపు అవుతుందో తెలుసుకోవడానికి చాలా మంది రుణగ్రహీతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరు 50 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నట్లయితే 7 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
లోన్ EMI తగ్గిస్తే ఎంత ఆదా అవుతుంది?
మీరు 20 సంవత్సరాల కాలవ్యవధికి 9.5 శాతం వడ్డీ రేటుతో 50 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారని అనుకుందాం.
* అప్పుడు మీ నెలవారీ EMI రూ.46,607 అవుతుంది.
* 20 సంవత్సరాలకు మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ.61,85,574 అవుతుంది.
* మొత్తం చెల్లింపు (అసలు + వడ్డీ) రూ.1,11,85,574 అవుతుంది.
* ప్రస్తుతం, ఈ సంవత్సరంలో వడ్డీ రేట్లలో 1 శాతం కోత నమోదైంది. దీని అర్థం ఇప్పుడు హోమ్ లోన్ రేటు 8.5 శాతంకు తగ్గింది.
* ఈ కొత్త వడ్డీ రేటుతో మీ EMI రూ.43,391 కి తగ్గుతుంది.
* మొత్తం వడ్డీ రూ.54,13,879 కి తగ్గుతుంది.
* మొత్తం చెల్లింపు రూ.1,04,13,879 అవుతుంది.
* ఈ విధంగా, మీకు మొత్తం లోన్‌పై రూ.7.71 లక్షల (రూ.1,11,85,574 - రూ.1,04,13,879) వరకు ఆదా అవుతుంది.
లోన్ టెన్యూర్ తగ్గిస్తే ఎంత ఆదా అవుతుంది?
మీరు EMI ని తగ్గించుకునే బదులు లోన్ కాలవ్యవధిని (టెన్యూర్) తగ్గించుకోవాలనుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గిన తర్వాత కూడా మీరు అదే EMI (రూ.46,607) చెల్లించడం కొనసాగిస్తే, మీ లోన్ కాలవ్యవధి 3.16 సంవత్సరాలు తగ్గుతుంది. ఈ ఆప్షన్ ద్వారా, 20 సంవత్సరాల రూ.50 లక్షల లోన్‌పై, మీరు వడ్డీలో రూ.17.65 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఆప్షన్ ద్వారా దాదాపు 10 లక్షల రూపాయలు ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి EMI ని తగ్గించుకోవడం లేదా టెన్యూర్ ను తగ్గించుకోవడం ద్వారా RBI రెపో రేటు కోత ప్రయోజనాన్ని పొందవచ్చు.