Bitcoin : షేర్ మార్కెట్ కుదేల్.. బంగారం పతనం.. కానీ ఇన్వెస్టర్ల పై కాసుల వర్షం కురిపిస్తున్న క్రిప్టో కరెన్సీ

కానీ ఇన్వెస్టర్ల పై కాసుల వర్షం కురిపిస్తున్న క్రిప్టో కరెన్సీ

Update: 2026-04-23 06:34 GMT

Bitcoin : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల దెబ్బకు స్టాక్ మార్కెట్లు రక్తం చిందిస్తుంటే, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం సైతం పలచబడింది. కానీ, ఈ వినాశకర వాతావరణంలో బిట్‌కాయిన్ మాత్రం రాకెట్‌లా దూసుకెళ్తోంది. ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటన చేసినప్పటికీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలగకపోవడంతో అందరూ డిజిటల్ కరెన్సీ వైపు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా బిట్‌కాయిన్ రికార్డు స్థాయికి చేరుకోగా, గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ ఏకంగా రూ.244 లక్షల కోట్లకు పైగా చేరింది.

క్రిప్టో మార్కెట్‌లో కనకవర్షం

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్‌లు గత వారం రోజులుగా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. సెన్సెక్స్‌లోని టాప్-30 స్టాక్స్‌లో కేవలం 10 మాత్రమే లాభాల్లో ఉండగా, మిగిలినవి 11 శాతం వరకు నష్టపోయి ఇన్వెస్టర్ల సొమ్మును ఆవిరి చేశాయి. అయితే, దీనికి పూర్తి భిన్నంగా క్రిప్టో మార్కెట్ కళకళలాడుతోంది. ప్రపంచంలోని టాప్-10 క్రిప్టోకరెన్సీలు గత వారం రోజుల్లో 6 శాతం పైగా లాభపడి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేస్తున్నాయి.

బిట్‌కాయిన్ కింగ్ అని ఎందుకు అంటారంటే..

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. ఈ క్రమంలో బిట్‌కాయిన్ అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన మార్గంగా మారింది. నేటి తాజా లెక్కల ప్రకారం.. ఒక బిట్‌కాయిన్ ధర $78,000 (సుమారు రూ.73.18 లక్షలు) రికార్డు స్థాయికి చేరుకుంది. గత 24 గంటల్లోనే గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.17 శాతం పెరిగి, దాదాపు $2.61 ట్రిలియన్లకు (సుమారు రూ.244.92 లక్షల కోట్లు) చేరింది. క్రిప్టో మార్కెట్ మొత్తం మీద ఒక్క బిట్‌కాయిన్ వాటానే దాదాపు 60 శాతంగా ఉండటం దాని ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది.

టాప్-10 కాయిన్స్ హవా

కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాదు, ఇతర డిజిటల్ కరెన్సీలు కూడా జోరు మీద ఉన్నాయి. గత 7 రోజుల్లో XRP ఏకంగా 7.34 శాతం రిటర్న్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోలానా 6 శాతం, మీమ్ కాయిన్‌గా పేరుగాంచిన డోజీకాయిన్ 5.24 శాతం లాభపడ్డాయి. ట్రోన్, బిఎన్‌బి వంటి కాయిన్స్ కూడా స్థిరంగా రాణిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ నగదును డిజిటల్ అసెట్స్ వైపు మళ్లించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం.

రూ.13 లక్షల కోట్ల లావాదేవీలు

క్రిప్టో మార్కెట్ కేవలం ధరల పరంగానే కాదు, ట్రేడింగ్ వాల్యూమ్ పరంగా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. గత 24 గంటల్లోనే క్రిప్టో మార్కెట్లో ఏకంగా $14.5 వేల కోట్ల (సుమారు రూ.13.56 లక్షల కోట్లు) విలువైన క్రయవిక్రయాలు జరిగాయి. ఇది మునుపటి రోజు కంటే 1.24 శాతం ఎక్కువ. మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, భారీ స్థాయిలో జరుగుతున్న ఈ లావాదేవీలు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నాయి. త్వరలోనే బిట్‌కాయిన్ మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News