UPI : ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా యూపీఐ.. చైనా, బ్రెజిల్ కూడా వెనుకే
చైనా, బ్రెజిల్ కూడా వెనుకే
UPI : భారత్ పేమెంట్స్ సిస్టమ్ యూపీఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచంలోని అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది. నేడు భారతదేశంలో దాదాపు అన్ని రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సహా పలు అంతర్జాతీయ ఏజెన్సీలు యూపీఐ ఉపయోగాన్ని గుర్తించాయి. ఐఎంఎఫ్ తాజా నివేదిక ప్రకారం.. లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా అవతరించింది.
గ్లోబల్ పేమెంట్స్‌లో సగం వాటా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌లలో యూపీఐ వాటా 49% గా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం రియల్ టైమ్ చెల్లింపులలో దాదాపు సగం చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతుండడం గమనార్హం.
భారత్ టాప్
అత్యధిక రిటైల్ పేమెంట్ లావాదేవీలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం లావాదేవీల సంఖ్య 26,620 కోట్లుగా ఉంటే, ఇందులో ఒక్క భారతదేశం నుంచే 12,930 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ విషయంలో భారత్ ఎంతటి ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో ఈ సంఖ్య స్పష్టం చేస్తుంది. ఇతర దేశాలతో భారత్‌ను పోల్చి చూస్తే:
భారత్: 12,930 కోట్లు
బ్రెజిల్: 3,740 కోట్లు
థాయ్‌లాండ్: 2,040 కోట్లు
చైనా: 1,720 కోట్లు
సౌత్ కొరియా: 910 కోట్లు
ప్రపంచంలో యూపీఐ ప్రత్యేకత
బ్రెజిల్‌లో పిక్స్ అనే రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ఉంది. ఇది అక్కడ అత్యధికంగా ఉపయోగించే రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా ఉంది. అదేవిధంగా, థాయ్‌లాండ్‌లో ప్రాంప్ట్‌పే వంటి వివిధ దేశాల్లో రియల్ టైమ్‌లో చెల్లించడానికి పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే యూపీఐ లాగా ఇంటరాపరబిలిటీ, ఇంత విస్తృతమైన కవరేజీ ప్రపంచంలో మరే ఇతర పేమెంట్ సిస్టమ్‌కు లేదనేది గమనించదగ్గ విషయం.