UPI : యూపీఐ బంపర్ ఆఫర్: ఇకపై లోన్ డబ్బులు కూడా యూపీఐతోనే!

ఇకపై లోన్ డబ్బులు కూడా యూపీఐతోనే!;

Update: 2025-07-21 05:22 GMT

UPI : యూపీఐ వాడుతున్న వాళ్లకు ఓ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై మీరు గోల్డ్ లోన్, బిజినెస్ లోన్ , లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను కూడా యూపీఐ ద్వారా ఎక్కడికైనా పంపించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మీ లోన్ అకౌంట్‌ను కూడా యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం వచ్చింది.

ఇప్పటివరకు మనం మన సేవింగ్స్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌లను మాత్రమే యూపీఐకి లింక్ చేసేవాళ్లం. కానీ, కొత్త రూల్ ప్రకారం, గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్ డబ్బులను కూడా బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది.

ఈ సౌకర్యం ముఖ్యంగా చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంది. రూ.2-3 లక్షల బిజినెస్ లోన్ తీసుకున్న వారు, పేమెంట్ల కోసం బ్యాంకులకు పదే పదే వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా, యూపీఐ ద్వారానే సులభంగా లావాదేవీలు చేసుకోవచ్చు. కాకపోతే ఒక రోజులో రూ.1 లక్ష వరకు మాత్రమే యూపీఐ ద్వారా పంపవచ్చు. నగదు రూపంలో ఒక రోజులో రూ.10,000 మాత్రమే తీసుకోవచ్చు. అంతేకాకుండా యూపీఐ ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Tags:    

Similar News