Rishab Shetty’s Big Deal: కాంతార 2కి.. రిషబ్ 100 కోట్లా.?

రిషబ్ 100 కోట్లా.?;

Update: 2025-07-10 08:24 GMT

 Rishab Shetty’s Big Deal: హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2022లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రిషబ్ శెట్టి, కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కూడా వచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ రూ.15 కోట్లతో రూపొందిస్తే దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ రూ. 4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఈ మూవీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్లో రిషబ్ షెట్టి లుక్ అదిరిపోయింది. వరాహస్వామి గర్జిస్తే ఎలా ఉంటుందో ఈ పోస్టర్‌లో రిషబ్ శెట్టి అలా కనిపించారు. ఈ లుక్‌ ప్రేక్షకులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

Tags:    

Similar News