‘Euphoria’ movie: యుఫోరియా పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Update: 2026-02-06 06:54 GMT

‘Euphoria’ movie: గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యుఫోరియా' (Euphoria) ఈరోజే థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోలు ముగిసిన తర్వాత అందుతున్న పబ్లిక్ టాక్ ప్రకారం ..ప్రస్తుత సమాజంలోని డ్రగ్ కల్చర్, జువైనల్ క్రైమ్స్ (మైనర్ల నేరాలు), పేరెంటింగ్ చుట్టూ తిరిగే ఈ కథకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో భూమిక పెర్ఫార్మెన్స్ సినిమాకే ప్రాణం పోసిందని ప్రేక్షకులు అంటున్నారు. ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, తన కొడుకు తప్పు చేసినా న్యాయం వైపు నిలబడే పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో ఆమె నటన కళ్లు చెమర్చిస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు.

సినిమా చాలా సహజంగా, నేటి యువత దారి తప్పుతున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించిందని, డార్క్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఇది నచ్చుతుందని అభిప్రాయపడుతున్నారు.కేవలం యూత్ మాత్రమే కాదు, ప్రతి పేరెంట్ ఈ సినిమా చూడాలని, పిల్లల పెంపకంలో చేసే తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఇందులో బాగా చూపించారని టాక్ వస్తోంది.

ప్లస్ పాయింట్స్:

భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ల పరిణతి చెందిన నటన.

సారా అర్జున్ కీలకమైన సన్నివేశాల్లో ఆకట్టుకోవడం.

కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది.

గుణశేఖర్ ఎంచుకున్న బోల్డ్ సబ్జెక్ట్ , దానిని ముగించిన తీరు.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ ల్యాగ్: కథనం అక్కడక్కడ నెమ్మదించిందని, కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించాయని టాక్

డాక్యుమెంటరీ ఫీల్: కొన్ని చోట్ల సినిమా కంటే ఒక సామాజిక అవగాహన కార్యక్రమంలా (డాక్యుమెంటరీలా) అనిపిస్తుందని చెబుతున్నారు

సినిమా నిడివి: ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి, సోషల్ మెసేజ్ ఉన్న ఎమోషనల్ డ్రామాలు లేదా క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ 'యుఫోరియా' ఒక మంచి ఆప్షన్ అని చెబుతున్నారు.

Tags:    

Similar News