A. R. Rahman: ఏఆర్ రెహమాన్ కు రూ. 30కోట్ల రెమ్యునరేషన్.?

రూ. 30కోట్ల రెమ్యునరేషన్.?

Update: 2026-04-04 02:45 GMT

A. R. Rahman: భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'రెమ్యూనరేషన్ రికార్డులు.సినిమా బడ్జెట్లతో సంబంధం లేకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు హీరోలకు ధీటుగా పారితోషికం అందుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సృష్టించబోతున్న రికార్డ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామాయణ' సినిమా కోసం రెహమాన్ ఏకంగా 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం. కేవలం ఈ భారీ మొత్తమే కాకుండా, సినిమా లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే గనుక నిజమైతే, భారత సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న సంగీత దర్శకుడిగా రెహమాన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.

అయితే ఈ రేసులో యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'AA23' కోసం అనిరుధ్ దాదాపు 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు లెజెండరీ కంపోజర్ రెహమాన్, మరోవైపు ట్రెండ్ సెట్టర్ అనిరుధ్.. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ 'మ్యూజికల్ వార్' చూస్తుంటే, ఇండియన్ సినిమా మ్యూజిక్ రేంజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News