Ram Pothineni’s ‘RAPO23’: రామ్ పోతినేని ‘RAPO23’కి సినిమాటోగ్రాఫర్‌గా తిరు

సినిమాటోగ్రాఫర్‌గా తిరు

Update: 2026-06-06 11:13 GMT

Ram Pothineni’s ‘RAPO23’: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరికొత్త అవతారంలోకి మారబోతున్నారు. ఆయన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RAPO23’ ద్వారా రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘వీర’ అనే లీడ్ రోల్ ప్లే చేస్తూనే, ఆయన డైరెక్షన్ బాధ్యతలను కూడా స్వయంగా హ్యాండిల్ చేస్తుండటం విశేషం.

ఇక ఈ సినిమా కోసం ఒక క్రేజీ టెక్నీషియన్ రంగంలోకి దిగారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP)గా ఎంపికయ్యారు. గతంలో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన "జనతా గ్యారేజ్", "భారత్ అనే నేను" వంటి సినిమాలకు తిరు అద్భుతమైన కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడు తిరు టీమ్‌లోకి రావడంతో, రామ్ విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా చూపించడానికి మేకర్స్ సాంకేతికంగా సినిమాను చాలా బలంగా సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

రాపో సినిమాటిక్స్ అనే కొత్త బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో, ఒక సరికొత్త నియో-నోయిర్ ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ చిత్రానికి పెట్టిన ట్యాగ్‌లైన్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. "ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్" (ఒంటరి తోడేలు కథ) అనే క్రేజీ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

Tags:    

Similar News