Actor Emraan Hashmi: ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ కు రూ.200 కోట్ల కలెక్షన్స్...ఇదేనా బెస్ట్ ఫిలిం
ఇదేనా బెస్ట్ ఫిలిం
Actor Emraan Hashmi: ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఒక ఫ్లాప్ సినిమాకు, ఇప్పుడు సీక్వెల్ వచ్చి ఏకంగా రెండు వందల కోట్లు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్‌లో సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది. ఆ సినిమానే 'ఆవారాపన్ 2'
2007లో ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో మోహిత్ సూరి దర్శకత్వంలో 'ఆవారాపన్' సినిమా విడుదలైంది. మంచి రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం కేవలం 12 కోట్ల రూపాయలే రాబట్టి పరాజయం పాలైంది. కానీ, ఆ తర్వాత టెలివిజన్లలో ,ఓటీటీల్లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు దీనికి ఫిదా అయిపోయారు. అలా ఈ చిత్రానికి ఊహించని విధంగా 'కల్ట్ స్టేటస్' వచ్చింది.
ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణే ఈ సీక్వెల్‌కు ప్రాణం పోసింది. ఇన్నేళ్ల తర్వాత నితిన్ కక్కర్ దర్శకత్వంలో.. ఇమ్రాన్ హష్మి సరసన దిశా పటానీ హీరోయిన్‌గా 'ఆవారాపన్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 14న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వందల పది కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అపూర్వ విజయంపై ఇమ్రాన్ హష్మి భావోద్వేగానికి గురయ్యారు. రెండు దశాబ్దాల క్రితం ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ వచ్చి చరిత్రను తిరగరాసింది.. ఇదే నా బెస్ట్ ఫిలిం అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.