ఓ రోమియా చిత్రంపై షాహిద్ కపూర్ మనసులో మాట

ఓ రోమియా చిత్రంపై హీరో షాహిద్ కపూర్ పాడ్ కాస్ట్ లో ఆసక్తికర ఆంశాలు

Update: 2026-01-21 10:29 GMT

ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తన సినీ ప్రయాణం గురించి, గ్రే షేడ్ పాత్రలతో ప్రయోగాలు చేయడం, విశాల్ భరద్వాజ్‌తో కలిసి పనిచేయడం వంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు లిపికా వర్మ తో షాహిద్ కపూర్ కొన్ని ఆసక్తికరమైన ఆంశాల్ని పంచుకున్నారు.

ఓ”రోమియో” సినిమా.. విశాల్ భరద్వాజ్ -షాహిద్ కపూర్ యొక్క గ్రిటీ వరల్డ్ అండ్ డ్రామా 1990ల నేపథ్యంలో సాగుతుంది. అండర్ వరల్డ్ ప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 13వ తేదీ, 2026న థియేటర్లలోకి రానుంది. నడియడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఇది, షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రీ, అవినాష్ తివారీ, నానా పటేకర్ మరియు ఫరీదా జలాల్ వంటి భారీ స్టార్ తారాగణంతో ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ యాక్షన్-డ్రామా చిత్రం. ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు,

INTERVIEW:

Q.మీ వర్క్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. సంవత్సరానికి ఒక సినిమా - అది ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా?

A.అస్సలు ప్లాన్ ఏమీ లేదు. నేను వ్యూహంతో పని చేయను - దురదృష్టవశాత్తు, అది నా శైలి కాదు. కొన్ని చిత్రాలకు సమయం పడుతుంది, కొన్నిసార్లు నేను నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకుంటాను. కానీ నేను ఇప్పుడు పక్కాగా సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. నేను అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చెయ్యగలను అని కూడా అనుకుంటున్నాను.

Q.మీరు, విశాల్ భరద్వాజ్ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. దాని అర్థం ఏమిటి?

A.నేను చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. విశాల్ సర్ నాకు కెరీర్‌ను బిల్డ్ చేసి రెగ్యులర్ పాత్రలను ఇచ్చారు. నేను 'కమీననీ' సినిమా చేసినప్పుడు, ఆ పాత్రలో నన్ను ఎవరూ ఊహించలేదు - నేను ఆ డబుల్ రోల్, ఆ కష్టమైన పాత్ర చేసినందుకే ప్రేక్షకులు నన్ను మంచి మరియు అందమైన పాత్రలో చూసారు. 'హైదర్' సినిమా విషయంలో దేశంలోని అత్యుత్తమ నటులతో నాకు ఒక పెద్ద సవాలు, డైరెక్టర్ నాకు మెయిన్ పాత్రను ఇచ్చాడు. అతను ఎప్పుడు నా కంఫర్ట్ జోన్‌కు మించి నన్ను ఉంచారు. అతను నా కెరీర్‌లో అంతర్భాగం. మేము ఎక్కువలో ఎక్కువ 7-8 సంవత్సరాలు కలిసి పని చేసి ఉంటాము. సాజిద్ భాయ్ నాకు ఫోన్ చేసి, వాళ్ళు సినిమా చేస్తున్నారని చెప్పాడు . ఆ సినిమా కథ నేను వినమని అడిగారు. నేను స్క్రిప్ట్ విన్నాను, నేను సంతోషం గా ఒకే అని చెప్పాను. అది అంతా అనుకోకుండా జరిగిపోయింది.

Q.ఈ సినిమాకి మీరు ఒప్పుకోవడానికి కారణమేమిటి?

A . నేను ప్రత్యేకమైన ప్రేక్షకులకు పెద్ద ఎక్సపెరిమెంటల్ సినిమా చేయాలనుకోలేదు. ప్రేక్షకులు కథను ఓన్ చేసుకునే అందరికి అర్ధమయ్యే కథను కోరుకున్నాను. ఇది 90ల నాటి ప్రేమకథ, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో.ఆకట్టుకునే కథ నాచురల్ సీన్స్ ఉంటాయి. అందుకే నేను ఒప్పుకున్నారు.

Q. మీరు తరచుగా నెగిటివ్ పాత్రలను పోషిస్తారు. వాటిమీద ఎందుకుఅంత ఇంట్రెస్ట్ మీకు?

A. గత మూడు సంవత్సరాలలో కథానాయకుడు నెగిటివ్ షేడ్స్ లేని మంచి సినిమా ఏదైనా చెప్పండి. నాకు ఎప్పుడూ కష్టమైన పాత్రలు అంటే చాలా ఇష్టం - కమీనీ, హైదర్, ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్. అవి ఫ్యాషన్‌గా మారడానికి ముందు కూడా మేము నెగిటివ్ షేడ్స్ వున్నపాత్రలు చేసేవాళ్ళం. నాకు ఎప్పుడూ సమస్య లేదు. మనను ఎక్కువ భాధను కలిగించేది మనకు అత్యంత సన్నిహితులే అదే నటనకు కూడా వర్తిస్తుంది. కష్టతరమైన పాత్రలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.

Q. ఈ ఇంటెన్స్ వున్నా పాత్రలు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తాయా?

A. లేదు, అవి నన్ను ప్రభావితం చేయవు - అవి నన్ను ఎదగడానికి సహాయపడతాయి. కొంత ఇబ్బంది ఉంది, కానీ మీరు ఆ పాత్ర నుండి ఎలా డిస్‌కనెక్ట్ కావాలో తెలుసుకోవాలి. మేము ప్రొఫెషనల్స్. పాత్ర తాలూకు పెయిన్ ని ఇంటికి తీసుకురాము. పాత్ర కోసం కనెక్ట్ అవ్వడానికి మరియు దానికి డిస్‌కనెక్ట్ చేయడానికి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడూ నాతో ఏపెయిన్ ని ఇంటికి తీసుకెళ్లను. సెట్ లో దర్శకునికి కావలసినవి అన్ని ఎమోషన్స్ ఇస్తాను, దర్శకుడు కట్ చెప్పిన తర్వాత పాత్రనుండి డిస్‌కనెక్ట్ అవుతాను.

Q: సినిమా విడుదలైనప్పుడు ఆ పేరిట కు తిరిగి కనెక్ట్ అవుతారా ?

A.అవును. సినిమా విడుదలైనప్పుడు, ప్రేక్షకుల స్పందనలు, విమర్శలు, ప్రేమ - ఇవన్నీ తిరిగి వస్తాయి. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం మరియు మీ జీవితంలో ఒక పెద్ద భాగం.

Q.ఈ సినిమా లో ఇంటెన్స్ కనిపిస్తోంది, 90's ప్రేమ కథ కూడా ఉందా?

A.ఖచ్చితంగా ఇది ప్రతిఫలం ఆశించని, ఘాడమైన ప్రేమ కథ - ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. ఇది 90ల నేపథ్యంలో సాగుతుంది, బలమైన భావోద్వేగాలు, వివిధ దశల్లో కథ ఉంటుంది. ఇందులో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తాయి - అది విశాల్ సర్ యొక్క విచిత్రమైన జీవిత ప్రపంచం మరియు ఒకే కోణంలో కథ ఉంటుంది.

Q.మీరు ఎదురుదెబ్బల్ని భాదలని ఎలా ఎదుర్కొంటారు?

A.మనం విచారాన్ని వదిలేయలేము - మీరు దానిని ప్రదర్శించాలి. భావాలు ఇంధనం లాంటివి, వాటిని నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. ఒక అడుగు ముందుకు వేయండి. వినయం ముఖ్యం. విజయం మిమ్మల్ని అజేయంగా ఉండేలా ఉంచుతుంది, కానీ ఎదురుదెబ్బలు మీకు గుణపాఠాలు.

Q. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న అనుభూతి చెందడానికి ఎంత సమయం పడుతుంది?

A.నేను ఈ ప్రశ్నను 20 సంవత్సరాలుగా వింటున్నాను. మీరు 10 సంవత్సరాలలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు - ఆ తర్వాత అంతా మీ వ్యక్తిగత ప్రయాణం. మీరు అలా ఆలోచించకూడదని ప్రూవ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.

Q.మీరు మీ కెరీర్‌లో ఈ సినిమాని ఎక్కడ ఉంచుతారు?

A.నేను దానిని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటాను, ప్రేక్షకులు దానిని స్వీకరించాలి. ప్రేక్షకులు చూసే వరకు, దానిని నిర్ధారించడం కష్టం. విడుదల సమయం, ప్రేక్షకుల మానసిక స్థితి వంటి అనేక సాంకేతిక మరియు బాహ్య అంశాలు ఉన్నాయి. నేను చెప్పగలిగేది ఏమిటంటే, మేము ఇష్టం తో పనిచేశాము మరియు ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించడానికి ప్రయత్నించాము. నేను సూపర్ హీరో చిత్రాలను మాత్రమే కాకుండా స్టోరీ బేస్డ్ చిత్రాలను నిర్మించడాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ఈ సినిమా జరిగే సమయంలో లో ఇది ఒక సంతోషకరమైన అనుభవం.

A.25 ఏళ్లలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేదు?

Q.ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు చూపిన ఇంపాక్ట్ తుది ఫలితాల కంటే ముఖ్యమైనదని నేను తెలుసుకున్నాను...రేసులో ముందుగా అర్హత సాధించడంపై నాకు నమ్మకం లేదు. పోటీ ముఖ్యం కాదు — ప్రతి శుక్రవారం లెక్కలు మారుతూ ఉంటాయి. నేను వాటిని సీరియస్‌గా తీసుకోలేను. మనం చిన్నప్పుడు ఎన్నో ప్లాన్ చేసుకుంటాము కానీ పెరిగేకొద్దీ పాజిటివ్ గా ఒకేదానిమీద ద్రుష్టి కేంద్రీకరించటం నేర్చుకుంటాము.

Tags:    

Similar News