Gaddar Awards 2025: గద్దర్ అవార్డులు 2026: చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పూర్తి విజేతల జాబితా ప్రకటన!
పూర్తి విజేతల జాబితా ప్రకటన!
Gaddar Awards 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులు (Gaddar Awards) 2025 సంవత్సరానికి సంబంధించిన విజేతలను శనివారం అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదలైన, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికెట్ పొందిన ఫీచర్ ఫిల్మ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలకు ఈ అవార్డులు ఇవ్వనున్నారు.
అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు లభించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్‌కు సినారె అవార్డు (డా. సి. నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు) దక్కింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది రోజున ఘనంగా జరగనుంది.
ప్రత్యేక అవార్డులు:
ఎన్టీఆర్ జాతీయ అవార్డు: చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సింగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అశ్వనీ దత్
కె.ఎల్. కాంతారావు ఫిల్మ్ అవార్డు: ఆర్. నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: రమేశ్ ప్రసాద్
సి. నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు: సుద్దాల అశోక్ తేజ్
అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు: జయసుధ
ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఉత్తమ అవార్డులు:
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం: తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (డెబ్యూ): లిటిల్ హార్ట్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం!
ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం: కోర్ట్
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్: మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం: అనగనగా
ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె. రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని: సాహితీ (కన్నప్ప)
ఉత్తమ హాస్య నటుడు: కృష్ణ తేజ్ రెడ్డి (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం!)
ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: సందీప్ (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: వై.గోవిందరాజు (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు:
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్:
యూనిటి (మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) - చిరందాస్ శ్రీకాంత్
ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం - పొన్నం రవిచంద్ర
మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు - బాలబ్రహ్మచారి పూసపాటి
ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్:
వనజీవి రామయ్య - భూసం రవీంద్రనాథ్
మౌనమే నీ భాష - రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్
సైబర్ స్లేవరీ - కె. నీలిమ
డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు)
ఇతర విభాగాల్లో బెస్ట్ బుక్ ఇన్ తెలుగు: శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు), ఉత్తమ సినీ విమర్శకుడు: హెచ్ రమేశ్‌బాబు వంటివి ఉన్నాయి.
ఈ అవార్డులు తెలుగు సినీ పరిశ్రమలో నాణ్యమైన, సామాజిక సందేశాత్మక చిత్రాలను ప్రోత్సహించడంతోపాటు ప్రముఖుల సేవలను గుర్తించేందుకు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కృషి.