Actor Vijay Devarakonda: కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి
మంచిగా చూసుకోండి
Actor Vijay Devarakonda: తెలుగు రాష్ట్రాలకు 'కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూసుకోండి' అంటూ నవ్వులు పూయించారు విజయ్ దేవర కొండ. . తెలుగు మీడియాను మర్యాదపూర్వకంగా కలిసింది విరోష్ జోడీ. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'మా జర్నీలో మీడియా ఓ భాగం. పెండ్లి చేసుకుని జంటగా ఇప్పుడు మీ ముందుకొచ్చాం. ఇదో డిఫరెంట్ ఎక్సీపీరియన్స్. కాలం గడిచిపోతోంది. మేం పెద్దవాళ్లం అయిపోతున్నం. కొత్త విషయాలు నేర్చుకుంటున్నం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మీ ఆశీ స్సులు మాకు కావాలి' అని విజయ్ కోరారు. 'మేం కలిసి జీవితంలో కొత్త అధ్యాయం మొద లుపెట్టాం' అని రష్మిక పేర్కొన్నారు.
టాలీవుడ్ర్ కపుల్ విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు వీరి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఇప్పటికే అభిమానులకు స్పెషల్ దావత్ ఇచ్చారు విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ .