Actress Daiji Shah: తల్లి కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు
పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు
Actress Daiji Shah: సల్మాన్ ఖాన్ నటించిన జై హో సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన భామ దైజీ షా. హేట్ స్టోరీ 3. రేస్ 3 వంటి చిత్రాలలో నటించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో పెండ్లికి చోటు లేదని స్పష్టం చేసింది. 41 ఏండ్ల వయసులో నూ ఒంటరిగా ఉండటమే ఇష్టమని కుండబద్దలు కొట్టింది. తన చుట్టూ ఉన్న జంటలు విడిపోతున్న వార్తలు వింటుంటే భయమేస్తుందట. ప్రేమ అనేది మొదట్లో బాగుంటుందని, ఆ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్థలు భరించడం చాలా కష్ట మని పేర్కొంది. అందుకే కేవలం తియ్యటి మాటలు చెప్పే వారిని నమ్మి పెళ్లి చేసుకునే స్థితిలో తాను లేదట. తన ఎగ్స్ని ఫ్రీజ్ చేయించిందట. భవిష్యత్తులో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను తల్లిని కాగలనని చెప్పింది. ఒక కుటుంబాన్ని ఏర్పర చుకోవడానికి కేవలం పెళ్లి మాత్రమే దారి కాదన్న ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.