Actress Jayaprada: జయప్రద జీవితంలో తీరని పీడకల: ఆమెనే భార్య అని కోర్టుకెక్కిన వ్యక్తి .. కాపాడింది ఎవరంటే?

ఆమెనే భార్య అని కోర్టుకెక్కిన వ్యక్తి .. కాపాడింది ఎవరంటే?

Update: 2026-02-03 09:13 GMT


Actress Jayaprada: ప్రముఖ నటి జయప్రద తన సినీ ప్రయాణంలో వెండితెరపై ఎంతటి వైభవాన్ని చూశారో, తెర వెనుక అంతటి మానసిక నరకాన్ని కూడా అనుభవించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఏళ్ల తరబడి వేధించిన ఒక ఉన్మాది గురించి ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.

ఏకంగా కోర్టులోనే భార్య అని కేసు!

జయప్రదపై విపరీతమైన వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి, ఆమెను తన భార్యగా భ్రమపడటమే కాకుండా ఏకంగా కోర్టులో కేసు వేశాడు. "జయప్రద నా భార్య.. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు ఆమెను నా దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారు" అని కేసు పెట్టడంతో జయప్రద కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారణ సమయంలో ఆ వ్యక్తి ఆమె శరీరంలోని పుట్టుమచ్చల గురించి అసత్యాలు చెప్పడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆపద్బాంధవుడిగా అమితాబ్ బచ్చన్

ఆ స్టాకర్ వేధింపులు షూటింగ్ సెట్స్‌కు కూడా పాకాయి. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ వ్యక్తి సెట్‌లోకి వచ్చి గొడవ చేస్తుంటే, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెంటనే స్పందించారు. జయప్రదను ఆ ఉన్మాది నుంచి రక్షించి, సురక్షితంగా మేకప్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఆమెకు అండగా నిలిచారు.

ప్రియాంక గాంధీని కూడా వదలని నిందితుడు

విచిత్రమేమిటంటే, జయప్రదను వేధించిన అదే వ్యక్తి ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా టార్గెట్ చేశాడట. ప్రియాంక గాంధీ కేసు దర్యాప్తు సమయంలో జయప్రద కుటుంబం తమ దగ్గరున్న పాత కేసు ఫైళ్లను పోలీసులకు అందజేసింది. ఆ ఆధారాలతోనే అతడిని పట్టుకుని తీహార్ జైలుకు పంపించినట్లు జయప్రద వెల్లడించారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ

ఇన్ని కష్టాలను దాటుకుని వచ్చిన జయప్రద, ప్రస్తుతం తన కెరీర్‌ను 2.0గాయజై అభివర్ణించారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఫౌజీలో ఆమె నటిస్తున్నారు. లైన్ ఆన్ ఫైర్ అనే వెబ్ సిరీస్‌లో కూడా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News