Actress Kriti Shetty: చిన్నప్పటి నుంచి ఆయనకు అభిమానిని
ఆయనకు అభిమానిని
Actress Kriti Shetty: సూపర్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ కృతి శెట్టి. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు నటించిన ఉప్పెన సూపర్ హిట్ నిలిచింది. ఇటీవల ఆమె మలయాళ చిత్రం 'ఏఆర్ఎమ్'లో కనిపించిందీ అమ్మడు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తమిళ చిత్రాల్లో ఒకటి 'వా వాతియార్' ఇందులో ఆమె నటుడు కార్తీకు జోడీగా నటిస్తోంది. దర్శకుడు నలన్ కుమారస్వామీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో కృతి శెట్టి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
చిన్నప్పటి నుంచే కార్తీకి తాను అభిమానినని చెప్పారు. ముఖ్యంగా ఆయన నటించిన 'పయ్యా' చిత్రాన్ని చిన్నప్పుడు ఎన్నోసార్లు చూసినట్లు తెలిపారు. బెంగళూరులో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు విసుగుగా అనిసిస్తే అదే సినిమాను మళ్లీ మళ్లీ చూసేదా న్నని చెప్పారు. కథ పూర్తిగా అర్థం కా కపోయినా కార్తీ, తమన్నా నటన తనను ఆకట్టు కుందంటోంది. సోషల్ మీడియా లోనూ యాక్టీవ్ గా ఉంటున్న ఈ భామ కొన్ని ఫొటోలును షేర్ చేసింది. వాటిని చూసిన అభిమాను లు ఫిదా అవుతున్నా రు. లైక్ లు కామెంట్ల తో తమ అభిమానాన్ని చాటుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో మెరిసిపో తోంది జేబమ్మ. ఈ ఆమె ధరించిన దుస్తులను ప్రముఖ డిజైనర్లు రోహిత్ గాంధీ,రాహుల్ ఖన్నా రూపొందించారు.