Actress Rakshita: ఒక్క పాటతో చెడ్డ రచయిత కాడు..భర్తకు రక్షిత సపోర్ట్
భర్తకు రక్షిత సపోర్ట్
Actress Rakshita: కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్దా కథానాయకుడిగా రూ పొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం కేడీ: ది డెవిల్, ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి. రీష్మా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధ మధుతోన్న వేళ ఇందులోని సర్కే చూసర్ పాట తీవ్ర వివా దానికి దారి తీసిన విషయం తెలిసిందే. అన్ని వేదికల్లోనూ ఈ పాటను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ప్రేమ్ భార్య, నటి రక్షిత స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ నోట్ విడుదల చేసింది. గతంలో వందలాది పాటలు, శృంగారమే. ప్రధానాంశంగా సినిమాలు వచ్చినప్పుడు ఎవరికీ ఇబ్బంది కలగలేదని పేర్కొంది. ఒక్క పాట విషయంలో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. తాను దీన్ని సమర్థించడం లేదని, కానీ ఈ వివక్షను అర్ధం చేసుకోవాలని ఈ పోస్ట్ పెడుతున్నట్లు తెలిపింది. ఒక్క పాట సరిగ్గా లేనంత మాత్రాన ఆయన చెడ్డ రచయిత అయిపోరండి. రాబోయే కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని తనకు నమ్మకం ఉందని, తమకు కొంచెం సమయం ఇవ్వండని కోరింది. తాను,టీమ్ ధైర్యంగా ఉన్నామని, కేడీ తమకు బిడ్డ లాంటిదని, చివరికి తాము ఏది సరైనదో అదే చేస్తామని వెల్లడించింది.