Actress Renu Desai: ఆ సినిమాకు నన్ను బాగా ట్రోల్ చేశారు..నేను డబ్బును లెక్క చెయ్యను
నేను డబ్బును లెక్క చెయ్యను
Actress Renu Desai: టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో నటిగా తిరిగి వచ్చినప్పుడు, తనపై కొంతమంది విమర్శలు చేశారని రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కమ్‌బ్యాక్ ఇచ్చింది, ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది" అంటూ ట్రోల్ చేశారని తెలిపారు. తాను ఆ తర్వాత మరే సినిమాకు సంతకం చేయలేదు అని గుర్తు చేస్తూ, అప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడినవారు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరని అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎలాగైనా మాట్లాడుతారని, కానీ తాను నటనను ప్రేమిస్తానని, అయితే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనని వివరించారు. ఒకవేళ తాను నిరంతరాయంగా సినిమాలు చేసి ఉంటే మంచి పేరు వచ్చేదని, కానీ తన దృష్టిలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వనన్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి విడాకుల విషయంలో ఇప్పటికీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని, కొందరు ఆయనను దేవుడిలా భావిస్తున్నందున, విడాకులు తీసుకున్నందుకు తాను ఓపిక చూపించలేదనే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ఈ మానసిక వేదన ఇప్పటికీ తనను వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.