Actress Samantha: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సామ్.. సినిమాలకు లాంగ్ బ్రేక్!
సినిమాలకు లాంగ్ బ్రేక్!
Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఒక తియ్యటి కబురు చెప్పారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ... తాను గర్భిణి అన్న విషయాన్ని సామ్ అధికారికంగా ధ్రువీకరించారు.
ఇటీవలే నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్‌లో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. సమంతకు ఇది సూపర్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది.ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంతతో పాటు రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందినీరెడ్డి, శ్రీముఖి, దిగంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేదికపైనే సమంత తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సినిమాలకు ఈ చిన్న విరామం ఇచ్చి, మళ్లీ సరికొత్తగా మీ ముందుకు వస్తానని సామ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో సమంత అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.