Actress Swetha Lakshman: సినిమా తేడా కొడితే అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: హీరోయిన్ సంచలన ఛాలెంజ్
హీరోయిన్ సంచలన ఛాలెంజ్
Actress Swetha Lakshman: సినిమా ఇండస్ట్రీలో ప్రమోషన్స్ కోసం చాలామంది రకరకాల హామీలు ఇస్తుంటారు. కానీ, ఓ సినిమా హీరోయిన్ మాత్రం ఏకంగా పబ్లిక్ లో బహిరంగంగా ఒక సంచలన ఛాలెంజ్ విసిరింది. సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్ సెంటర్‌లో గుండు కొట్టించుకుంటానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో... నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సహ': లైఫ్ ఆఫ్ సంజు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
చిత్ర యూనిట్ పై నమ్మకంతో ఆమె మాట్లాడుతూ... 'అందరి జీవితాలు ఈ సినిమాకు కనెక్ట్ అవుతాయి. ప్రేమంటే ఏంటో, ప్రేమలో ఉండే బాధ, త్యాగం ఏంటో ఇందులో చూపించాం. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ ఎమోషన్స్ ద్వారా చూపించాం. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం లేదు.. ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. 'సహ' చూశాక ఎంత మంచి సినిమా తీశారు అని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా చూసి నిరాశపడితే... నేను అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటా!' అంటూ ఆమె తన కంటెంట్ పై ఉన్న నమ్మకాన్ని బలంగా చెప్పారు.
ఇక ఇదే ఈవెంట్‌లో మాట్లాడిన హీరో శివ కుమార్ కాసారం కూడా అంతే ధీమా వ్యక్తం చేశారు. సినిమా అంచనాలు అందుకోకపోతే తనను నిందించాలని, కావాలంటే తనకు ఫోన్ చేసి తిట్టాలంటూ ఏకంగా తన పర్సనల్ ఫోన్ నంబర్‌ను బహిరంగంగా ప్రకటించారు. సెప్టెంబర్ 4న సినిమా విడుదల వద్దు అన్నవాళ్లు ఉన్నారని, కానీ పెద్ద సినిమాల మధ్య విడుదలై మంచి వసూళ్లు సాధించినప్పుడే ఇండస్ట్రీ మనవైపు చూస్తుందని ఆయన అన్నారు.
మొత్తానికి, మేకర్స్ ఇస్తున్న ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే... 'సహ' సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. మరి ఈ సినిమా నిజంగానే ఆ అంచనాలను అందుకుంటుందా? లేదా? అనేది సెప్టెంబర్ 4న తెరపైనే తేలనుంది.