Adivi Sesh’s Dacoit Postponed: అడివి శేష్ డెకాయిట్ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?

రిలీజ్ ఎప్పుడంటే..?

Update: 2025-10-29 06:56 GMT

Adivi Sesh’s Dacoit Postponed: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం డెకాయిట్ విడుదల తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా డిసెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నా.. ఈ తేదీని మారుస్తూ చిత్రబృందం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. డెకాయిట్ చిత్రాన్ని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా వస్తున్న లాంగ్ వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని ఖరారు చేశారు.

కొత్త విడుదల తేదీని అడివి శేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఈసారి మామూలుగా ఉండదు. వెనక్కి తగ్గేదే లేదు. #DACOIT ఈ ఉగాదికి 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది" అని ఆయన పోస్ట్ చేశారు. యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో అడివి శేష్ గాయపడటం వల్లే సినిమా విడుదల వాయిదా పడిందని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి అంశాలతో డెకాయిట్ కథ ఉద్వేగభరితంగా సాగనుంది. తనను మోసం చేసిన మాజీ ప్రియురాలిపై కోపంతో రగిలిపోతూ, పగ తీర్చుకోవాలనుకునే ఓ ఖైదీ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, తదుపరి షెడ్యూల్‌ను మహారాష్ట్రలో ప్లాన్ చేశారు.

Tags:    

Similar News