Aishwarya Lekshmi: సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఐశ్వర్య లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె ‘వసంత’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సాయి దుర్గా తేజ్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఐశ్వర్య లక్ష్మి పల్లెటూరి వాతావరణంలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. చీర కట్టుకుని, చేతిలో కుండ పట్టుకుని ఉన్న ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది.

కొత్త దర్శకుడు రోహిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిరంజన్, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అనన్య నాగళ్ల మరో హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Tags: