Akhand-2 Tandavam Begins: అఖండ-2 తాండవం మొదలు..పవర్ డైలాగ్స్‌తో బ్లాస్టింగ్ రోర్ వీడియో
పవర్ డైలాగ్స్‌తో బ్లాస్టింగ్ రోర్ వీడియో
Akhand-2 Tandavam Begins: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ-2 చిత్రం నుంచి మాస్ బ్లాస్టింగ్ మొదలైంది. సినిమా మేకర్స్ "బ్లాస్టింగ్ రోర్" పేరుతో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ 56 సెకన్ల వీడియో బాలకృష్ణ పవర్‌ఫుల్, మాస్ డైలాగ్స్‌తో నిండి ఉండటంతో, ఇది నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో బాలకృష్ణ చెప్పిన "సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... ఏ సౌండ్‌కు నవ్వుతానో... ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. కొడకా.. ఊహకు కూడా అందదు.." అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ చేస్తోంది.
విడుదలకు సిద్ధమవుతున్న అఖండ-2
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, గతంలో బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'అఖండ'కు సీక్వెల్‌గా రూపొందుతోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలకృష్ణతో పాటు సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన లభించడంతో.. అఖండ-2 చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విడుదలైన ఈ బ్లాస్టింగ్ రోర్ వీడియోతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగింది.