Akhanda 2 : అఖండ 2 కు బిగ్ షాక్ !

బిగ్ షాక్ !

Update: 2025-12-11 08:02 GMT

Akhanda 2 : అఖండ 2 కు తెలంగాణలో టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. టికెట్ల ధర పెంపుపై అడ్వకేట్ విజయ్ గోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్లపై తేల్చకుండా టికెట్ ధరలు పెంచొద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ జీవో జారీ చేశారని తన పిటిషన్ లో తెలిపారు.

టికెట్ ధరల పెంపు హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని ఆయన స్పష్టం చేశారు. టికెట్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని విజయ్ గోపాల్ తన పిటిషన్ లో డిమాండ్ చేశారు.లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అఖండ 2 రేపు రిలీజ్ కానుంది.

ఇవాళ తెలుగు రాష్టాల్లో ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో, నిర్మాణ సంస్థ (14 రీల్స్ ప్లస్), ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International) సంస్థ మధ్య ఉన్న ఆర్థికపరమైన వివాదాలు, బకాయిల సమస్య కారణంగా మద్రాసు హైకోర్టు స్టే విధించింది.

కొన్ని రోజులుగా జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత, ఫైనాన్షియల్ సమస్యలు పరిష్కరించబడ్డాయి. దీంతో మద్రాసు హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 2డీ, 3డీ ఫార్మాట్‌లలో విడుదల కానుంది.

ఇక ఈ పెద్ద సినిమా విడుదల కారణంగా డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ‘మోగ్లీ’, ‘సైక్ సిద్దార్థ్’ వంటి కొన్ని చిన్న సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.

Tags:    

Similar News