'Alcohol' Teaser: అల్లరి నరేష్ ఆల్కహాల్ టీజర్ అదిరింది..

ఆల్కహాల్ టీజర్ అదిరింది..

Update: 2025-09-05 04:39 GMT

'Alcohol' Teaser: అల్లరి నరేష్ నటించిన కొత్త సినిమా 'ఆల్కహాల్' టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 1న థియేటర్లలో విడుదల కానుంది.నరేష్ ఈ సినిమాలో ఒక డార్క్, సీరియస్ పాత్రలో కనిపించారు. కామెడీ హీరోగా కాకుండా, నాంది, ఉగ్రం' లాంటి సినిమాల తరహాలో మరో కొత్త కోణాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. కమోమడియన్ సత్య, నరేష్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. వారిద్దరి మధ్య వచ్చే డైలాగ్స్, ప్రత్యేకించి "లక్షలు సంపాదిస్తావ్, కానీ మందు తాగవ్, ఇంకెందుకు రా నీ బతుకు!" అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.టీజర్ చూస్తుంటే, సినిమా ఆల్కహాల్ చుట్టూ అల్లుకున్న ఒక థ్రిల్లర్ డ్రామా అని తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంపై మద్యం ఎలా ప్రభావం చూపుతుంది అనే అంశంపై ఈ సినిమా కథ నడుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా రుహానీ శర్మ, నిహారిక ఎన్.ఎమ్. నటించారు. సుహాస్ నటించిన 'ఫ్యామిలీ డ్రామా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ టీజర్ సినిమాపై మంచి హైప్ పెంచింది. ముఖ్యంగా అల్లరి నరేష్ కొత్త అవతారం, అలాగే కథలోని ఉత్కంఠత సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News