Allu Aravind: సినీ పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదే

ఎవరి కుంపటి వారిదే;

Update: 2025-08-15 14:23 GMT

Allu Aravind: సైమా' (SIIMA) అవార్డుల ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తెలుగు సినిమాలకు ఏకంగా 7 జాతీయ అవార్డులు వచ్చినా, మన పరిశ్రమ వాటిని ఒక పండుగలా జరుపుకోలేదని, విజేతలను సత్కరించే సంప్రదాయం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమలో "ఎవరి కుంపటి వారిదే" అన్నట్టుగా ఉందని, అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయి ఐక్యతతో ఉండటం లేదన్నారు. అందుకే సామూహికంగా మంచి పనులు చేయలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. ​తెలుగు పరిశ్రమ స్పందించకముందే జాతీయ అవార్డు విజేతలను గుర్తించి, సత్కరించేందుకు సైమా బృందం ముందుకు రావడం అభినందనీయమని అల్లు అరవింద్ ప్రశంసించారు.

​ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది అల్లు అరవింద్ మాటలు సినీ పరిశ్రమలో ఉన్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇతర సినీ ప్రముఖుల ఇంకా స్పందించ లేదు.

Tags:    

Similar News