Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే.. ఇవాళ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

ఇవాళ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్

Update: 2026-04-08 03:53 GMT

Allu Arjun: దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. మాస్ డైరెక్టర్ అట్లీతో ఆయన చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. నేడు బన్నీ బర్త్‌డే గిఫ్ట్‌గా రిలీజ్ చేసిన 'ప్రీ-లుక్' పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఒక క్రూరమైన అడవి జంతువు వేలి గోళ్లను చూపిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తుంటే.. అట్లీ మనల్ని ఒక సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఈ గోళ్లు ఏ జంతువువి? అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది? అన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ.. ఈరోజు ఉదయం 11 గంటలకు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట! బన్నీ కెరీర్‌లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ రోల్ అని తెలుస్తోంది.

ఇక గ్లామర్ విషయానికి వస్తే.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అంతేకాదు, ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ముంబైలో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News