Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన '

షో స్టాపర్స్ 2026 ప్రత్యేక ఎడిషన్ కవర్ పేజీపై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత చిత్ర పరిశ్రమ తీరుతెన్నులు, బాక్సాఫీస్ విజయాలపై బన్నీ చేసిన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

స్టార్‌డమ్‌ను మించిన కంటెంట్

సినిమా విజయానికి కేవలం నటీనటుల స్టార్‌డమ్ లేదా ఇమేజ్ మాత్రమే సరిపోదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ లేదా మరే ప్రాంతీయ సినిమా అయినా సరే.. కథలో బలం, సరికొత్త కంటెంట్ ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారని, మంచి కంటెంట్‌కు భాషా సరిహద్దులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

టాప్ 100 ప్రముఖుల్లో చోటు:

సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 100 మంది ప్రముఖులతో షో స్టాపర్స్ 2026 జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది.

జాబితాలోని ఇతర దిగ్గజాలు:

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌లాల్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితర భారతీయ ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.

Tags: