Allu Arjun: ముంబైలో మకాం మార్చనున్న అల్లు అర్జున్: కారణం ఏంటంటే?

కారణం ఏంటంటే?

Update: 2026-04-21 04:01 GMT

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ముంబైని తన రెండో నివాసంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వరుస బాలీవుడ్ ఆఫర్లు, సినిమాలతో బిజీగా ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా సెటిల్ అయ్యేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు.

గత ఏడాది కాలంగా అల్లు అర్జున్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమా. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని నెలల పాటు ముంబైలోనే జరగనుంది. ప్రతివారం హైదరాబాద్ నుండి ముంబైకి ప్రయాణాలు చేయడం, హోటల్ స్టేలు నిర్మాతలకు భారంగా మారుతున్నాయని బన్నీ భావించారు. ఖర్చు తగ్గించడంతో పాటు ప్రయాణ శ్రమ లేకుండా ఉండటానికి ముంబైలో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని ఆయన నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ముంబైలో ఒక మంచి అపార్ట్‌మెంట్ కోసం అల్లు అర్జున్ వెతుకుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌నే మెయిన్ బేస్‌గా ఉంచుకుంటూనే, పని కోసం ముంబైలో కూడా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. విశేషం ఏంటంటే, బన్నీకి ఇప్పటికే దుబాయ్‌లో సొంత ఇల్లు ఉంది. ఒకప్పుడు దుబాయ్‌ను రెండో నివాసంగా అనుకున్నా, ఇప్పుడు సినిమాల పరంగా ముంబై అయితేనే కరెక్ట్ అని ఆయన భావిస్తున్నారు.

అల్లు అర్జున్‌కు బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. సినిమాలతో పాటు కార్పొరేట్ బ్రాండ్ ప్రమోషన్లు కూడా ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ‘రాకా’ సినిమా పూర్తయ్యాక, లోకేష్ కనగరాజ్‌తో ఆయన మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే హీరో సూర్య వంటి వారు కూడా ముంబైలో సెటిల్ అవ్వగా, ఇప్పుడు బన్నీ కూడా అదే బాటలో నడుస్తున్నారు.

Tags:    

Similar News