Allu Arjun’s ‘Raaka’: అల్లు అర్జున్ రాకాలో మైథాలజీ టచ్.. అట్లీ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!

అట్లీ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!

Update: 2026-04-13 09:09 GMT

Allu Arjun’s ‘Raaka’: సౌత్ ఇండియాలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరు అట్లీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘రాకా’ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన బన్నీ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఏంటి? అట్లీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక క్రేజీ బజ్ తెగ వైరలవుతోంది.

‘రాకా’ కేవలం ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. అంతకు మించి! ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ తో పాటు మైథాలజీని కూడా మిక్స్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పురాణాల్లో ఉన్న ఆసక్తికరమైన అంశాలను, తోడేళ్లకు (Werewolves) సంబంధించిన మిస్టరీని ఈ కథలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. సైన్స్ కి అందని అద్భుతాలను, పురాణ గాథలను ముడిపెడుతూ అట్లీ ఒక విజువల్ వండర్ ను ప్లాన్ చేస్తున్నారట. బన్నీ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన ప్రయోగం కాబోతోందని టాక్!

ఇక ఈ ప్రాజెక్ట్ లో నటించే తారల విషయానికి వస్తే.. స్క్రీన్ మొత్తం గ్లామర్ తో నిండిపోనుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెతో పాటు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ అందిస్తున్నారు. అట్లీ మార్క్ మేకింగ్, సాయి అభ్యంకర్ మ్యూజిక్, బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!.పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు ‘రాకా’ తో గ్లోబల్ రేంజ్ లో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తోడేళ్ళ మిస్టరీ ఏంటి? బన్నీ లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News