Allu Arjun: అల్లు అర్జున్ సంచలనం... అభిమానులకు బీమా పాలసీ !

అభిమానులకు బీమా పాలసీ !

Update: 2026-07-29 05:05 GMT

Allu Arjun: హైదరాబాద్‌లో ఇటీవల 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' (AAFA) ఆధ్వర్యంలో జరిగిన అభిమానుల ఆత్మీయ సమావేశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌తో గంటల కొద్ది సరదాగా గడపడమే కాకుండా, వారిలో జోష్ నింపేలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ మరియు నెగెటివిటీపై బన్నీ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎవరైనా తనకు నచ్చకపోతే వారిని పదే పదే విమర్శించడం, ట్రోల్ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మనకు ఇష్టం లేని విషయాల కోసం లేదా వ్యక్తుల కోసం మన అమూల్యమైన సమయాన్ని, శక్తిని ఎప్పుడూ వృథా చేయకూడదని ఆయన పిలుపునిచ్చారు.

అభిమానులకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఆయన చెబుతూ.. "మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్‌గా వాళ్లను వదిలేయండి, కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట నిలబడి వెయిట్ చేయండి.. పర్లేదు, కనీసం ఆ సమయాన్ని మీరు ఆస్వాదిస్తారు కదా!" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. రోజూ మన దగ్గర ఉండే వంద శాతం శక్తిని ఇతరులను ద్వేషించడానికి కాకుండా, మన సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని ఆయన విలువైన సలహా ఇచ్చారు.

అంతేకాకుండా, ఈ మీటింగ్‌కు వచ్చిన ప్రతి అభిమానికి ప్రత్యేకంగా బీమా పాలసీలను అందించడం విశేషం. అభిమానుల బాగోగులు, వారి కుటుంబాల భద్రత ఎంతో ముఖ్యమని బన్నీ ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు. కేవలం సినిమాల గురించే కాకుండా జీవితంలో క్రమశిక్షణతో ఎలా ఉండాలో తనదైన శైలిలో వివరించిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News