Upasana’s Special Video: ఎమోషనల్ జర్నీ.. కవలలకు సంబంధించి ఉపాసన స్పెషల్ వీడియో..

కవలలకు సంబంధించి ఉపాసన స్పెషల్ వీడియో..

Update: 2026-02-10 04:27 GMT

Upasana’s Special Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన వేళ, ఆ మధుర క్షణాలకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. జనవరి 31న ఒక పాప, బాబు పుట్టిన సందర్భంగా మెగా కుటుంబంలో నెలకొన్న భావోద్వేగాలను ఈ వీడియోలో ఆవిష్కరించారు.

భావోద్వేగ ప్రయాణం

ఆసుపత్రికి చేరుకున్నప్పటి నుంచి డెలివరీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆనందం వరకు అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. అభిమానులు బయట స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రెండు మెడికల్ టీమ్స్ పర్యవేక్షణ

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం హైదరాబాద్ అపోలో, చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి రెండు ప్రత్యేక వైద్య బృందాలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. తల్లి, ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. ఉపాసన గతంలో అడ్మిట్ అయిన గదిలోనే ఈసారి కూడా చేరడం ఒక సెంటిమెంట్‌గా భావించారు. అపోలోను ఆమె తన సొంత ఇంటిలా భావించారని వైద్యులు తెలిపారు.

ముహూర్తం ప్రకారం జననం:

ఈ ప్రక్రియలో జ్యోతిష్య సలహాలు కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. ఒక ప్రముఖ జ్యోతిష్కుడు సూచించిన జనవరి 31 రాత్రి 11:30 గంటల తర్వాత ఉన్న శుభ ముహూర్తంలోనే డెలివరీ జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం తల్లి, కవలలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మెగా వారసుడు, వారసురాలు ఒకేసారి రావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News