Epic Trailer: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కొత్త దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ సినిమా.. లండన్‌లోని కాలేజ్ జీవితాన్ని నేపథ్యంగా చేసుకుని తెరకెక్కిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కాలేజ్ లైఫ్‌లో ఉండే సరదా, స్నేహాలు, ప్రేమ, రిలేషన్‌షిప్స్‌ను చూపించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా కనిపించగా.. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

ఈ సినిమాలో యువత మాట్లాడుకునే విషయాలను కూడా చాలా సహజంగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సెక్స్, పీరియడ్స్, రిలేషన్‌షిప్స్ వంటి అంశాలపై పాత్రలు ఓపెన్‌గా మాట్లాడటం ఆసక్తికరంగా ఉంది. చివర్లో ఆనంద్.. వైష్ణవిని ‘పీరియడ్స్ వచ్చాయా?’ అని అడగగా.. ఆమె “పీరియడ్స్ అంటే మనకు కావాల్సినప్పుడు వచ్చే అమెజాన్ ఆర్డరా?” అంటూ ఇచ్చే సమాధానం సరదాగా ఉంది.

మొదట సరదా కాలేజ్ లవ్‌స్టోరీగా మొదలయ్యే కథ.. క్రమంగా ఎమోషనల్‌గా మారనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. కేవలం ప్రేమ సన్నివేశాలకే పరిమితం కాకుండా.. యువతకు కనెక్ట్ అయ్యేలా రిలేషన్‌షిప్‌లోని మరో కోణాన్ని కూడా సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.

విజయవంతమైన ‘90s’ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్.. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’తో సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య గతంలో బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ సినిమాలో జంటగా నటించిన విషయం తెలిసిందే.

Tags: