Actress Ananya Nagalla: పవర్‌ఫుల్ పాత్రలో అనన్య నాగళ్ల.. లీసా ఫస్ట్ లుక్ విడుదల

లీసా ఫస్ట్ లుక్ విడుదల

Update: 2026-04-14 12:46 GMT

Actress Ananya Nagalla: మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల, ఇప్పుడు లీసా అనే వైవిధ్యభరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జవహర్ లాల్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.

కథ వినగానే గ్రీన్ సిగ్నల్

ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ.. సినిమా కథ విన్న వెంటనే తాను చాలా ఎగ్జైట్ అయ్యానని తెలిపారు. సాధారణంగా హీరోయిన్లకు దొరికే పాత్రల కంటే లీసాలో తన రోల్ చాలా భిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఆమె వెల్లడించారు.

కెరీర్ బెస్ట్ మూవీ:

ఒక నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం రావడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పానని, ఇది తన కెరీర్‌లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

విజువల్స్ అద్భుతం..

సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి పనితనంపై అనన్య ప్రశంసల వర్షం కురిపించారు. తను గతంలో నటించిన చిత్రాల కంటే ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్‌గా వచ్చాయని, ఆ విజువల్స్ చూశాక నటిగా తనను తాను మరింత మెరుగుపరుచుకోవాలనే స్ఫూర్తి కలిగిందని ఆమె పేర్కొన్నారు. సినిమా కోసం చిత్ర బృందం రాత్రింబవళ్లు శ్రమించిందని, ముఖ్యంగా తెల్లవారుజాము వరకు షూటింగ్ చేస్తూ అవుట్‌పుట్ కోసం కష్టపడ్డారని గుర్తుచేసుకున్నారు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. అనన్య నాగళ్ల ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News