Anil Ravipudi Plans Multistarrer: అనిల్ రావిపూడి మల్టీస్టారర్: వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో భారీ ప్రాజెక్ట్.. ప్రొడక్షన్ హౌస్ ఖరారు!
ప్రొడక్షన్ హౌస్ ఖరారు!
Anil Ravipudi Plans Multistarrer: వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేయనున్నారు. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కల్యాణ్ రామ్‌లతో కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేశారు.
గతంలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ, నిర్మాణ సంస్థపై సస్పెన్స్ కొనసాగింది. అయితే తాజాగా ఈ సినిమాను సాహు గారపాటి నేతృత్వంలోని 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి తోడు సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నాయి. ఈ ముగ్గురు (వెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి) కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా అ కలిసి వస్తుంది. అందుకే ఈ మల్టీస్టారర్‌ను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్ మరియు కృతి శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.