Anna Konidela Joins Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ లోకి అన్నా కొణిదెల: భార్యకు సాదర స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్!

భార్యకు సాదర స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్!

Update: 2026-03-26 07:24 GMT

Anna Konidela Joins Instagram: జనసేనాని పవన్ కళ్యాణ్ సాధారణంగా ట్విట్టర్ (X) ద్వారా తన అభిమానులతో కనెక్ట్ అవుతుంటారు, అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఇంటి నుండి మరొకరు సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ఫాలోవర్లతో నేరుగా మాట్లాడటానికి, తన ఆలోచనలను పంచుకోవడానికి ఆమె ఈ వేదికను ఎంచుకున్నారు.

అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ అరంగేట్రంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. "డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ కొత్త ప్రదేశంలోకి అడుగుపెడుతున్న నీకు నా శుభాకాంక్షలు. నీ రాక ఇక్కడ అర్థవంతమైన చర్చలకు, స్పూర్తిదాయకమైన సంభాషణలకు దారితీస్తుందని ఆశిస్తున్నాను" అంటూ పవన్ తన మనసులోని మాటను పంచుకున్నారు.

తన మొదటి పోస్ట్‌లో అన్నా కొణిదెల భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేశారు. "ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.. ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చాను" అని ఆమె రాసుకొచ్చారు. అన్నా తన ప్రొఫైల్ బయోలో "మనసుతో రష్యన్, ఆత్మతో ఇండియన్" (Russian by heart, Indian by soul) అని రాసుకోవడం విశేషం. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని, భారతదేశంపై ఆమెకు ఉన్న మక్కువను ప్రతిబింబిస్తోంది.

Tags:    

Similar News