OG Movie: ఓజీ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్
పవర్ ఫుల్ సాంగ్
OG Movie: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ' సినిమా నుంచి 'గన్స్ అండ్ రోజెస్' అనే కొత్త పాట విడుదలైంది. ఈ పాట మొదటిసారిగా సినిమా గ్లింప్స్‌లో 'హంగ్రీ చీతా' అనే లిరిక్స్ ద్వారా హైలైట్ అయింది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందించగా.. అద్వితీయ, హర్ష లిరిక్స్ రాశారు. ఈ పాట పవన్ కళ్యాణ్ పోషిస్తున్న గ్యాంగ్ స్టర్ పాత్రను ఎలివేట్ చేస్తూ, పవర్ఫుల్ మాస్ బీట్స్ తో రూపొందించబడింది. ఈ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫైర్‌స్టార్మ్' (Firestorm) సువ్వి సువ్వి' (Suvvi Suvvi), ఇది ఒక మెలొడీ పాటలు పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ మూవీ విడుదల కాకముందే కొన్ని రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా ఓవర్సీస్ (విదేశాలు) మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది.అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యంత వేగంగా $1 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి తెలుగు సినిమాగా 'ఓజీ' రికార్డు సృష్టించింది. కేవలం మూడు వారాల ముందు నుంచే ఈ బుకింగ్స్ మొదలయ్యాయి.