Khaidi2: ఖైదీ 2లో అనుష్క.. అంచనాలు పెంచుతున్న లోకేష్!
అంచనాలు పెంచుతున్న లోకేష్!;
టాలీవుడ్ లో తనదైన శైలి ముద్ర వేసిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. తన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కింగ్ నాగార్జున ‘సూపర్' చిత్రంతో ఇండస్ట్రీకి పరి చయమైన ఈ భామ తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే కోవిడ్ తర్వాత సినిమాల విషయంతో కాస్తా స్లో అయిన స్వీటీ.. చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘ఘాటి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.క్రిష జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ వచ్చే నెల 11న ప్రపంచవ్యా ప్తంగా రిలీజ్కానుంది. అయితే తాజాగా డైరె క్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపుదిద్దు కుంటున్న ఖైదీ 2లో అనుష్క నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఆమె లేడీ డాన్ పాత్రలో కనిపించబోతుందని టాక్. ముఖ్యంగా అనుష్క క్యారెక్టర్ గా చాలా రగ్గడ్ గా, రఫ్ గా ఉంటుందని.. ఇందుకోసం డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఎక్కడ రాజీ పడకుండా దీటుగా అవుట్ ఫుట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కని పిస్తోంది. అదే నిజమైతే ‘ఖైదీ 2'పై అంచనాలు ఇంకా పెరిగిపోతా యి. కోలీవుడ్ లో 'బిల్లా'లో డాన్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అనుభవం అనుష్కకు ఉంది. కెరీర్ ఆరంభంలో నటించిన సూపర్ చిత్రంలోనూ సూపర్ లేడీగా కనిపించింది. అన్నీ కుదిరితే అనుష్క కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రం కాబట్టి మిగతా భాషల్లోనూ అవకాశాలొస్తాయి.