Anirudh and Kavya Maran: అనిరుధ్, కావ్య మారన్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? వైరల్ వార్తల్లో నిజమెంత?
వైరల్ వార్తల్లో నిజమెంత?
Anirudh and Kavya Maran: సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, అనిరుధ్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే తాజాగా ఈ పెళ్లి వార్తలకు సంబంధించి మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. అనిరుధ్‌కు బంధువైన సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో వీరి పెళ్లిని కన్ఫర్మ్ చేశారని, ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని.. కావ్య మారన్‌ను ఆయన ప్రశంసించారంటూ కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలు కథనాలు రాశాయి.
కానీ.. ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదు! తన పేరుతో జరుగుతున్న ఈ పెళ్లి ప్రచారాన్ని నటుడు వై.జీ. మహేంద్రన్ తీవ్రంగా ఖండించారు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో కావ్య మారన్ ప్రస్తావనే తేలేదని, కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి తప్పుడు వార్తలను సృష్టించారని ఆయన స్పష్టం చేశారు.
గతంలో సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్, బీస్ట్, రాయన్ వంటి సినిమాలకు అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆ ప్రొఫెషనల్ బాండింగ్ వల్లే వీరిద్దరిపై ఇలాంటి రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికే అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ తాము కేవలం స్నేహితులమేనని, పెళ్లి వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.