Arjun Sarja: ఆ నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది

నా జీవితాన్ని మార్చేసింది

Update: 2026-02-17 02:35 GMT

Arjun Sarja: తన సొంత కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పెట్టి అర్జున్ సర్దా తెరకెక్కించిన తాజా చిత్రం సీతా పయనం. ఇటీవల ప్రేక్ష కుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా థాంక్స్ మీట్ నిర్వహించగా... అందులో పాల్గొన్న అర్జున్ తన సినీ ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. తాను పోలీస్ ఆఫీసర్ కావాలని తన తండ్రి ఆశించగా.. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో నుంచి విజయాలు అందుకున్నప్పటికీ ఒక దశలో వరుస పరాజయాలతో మూవీస్ మానేయాలను కున్నాడట. ఆ టైమ్లో జెంటిల్మెన్ కథతో డైరెక్టర్ శంకర్ హీరో వద్దకు వచ్చాడట. కానీ వరుస ప్లాప్ లతో ఉన్న తాను మరో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని దర్శకుడికి చెప్పాడట. కానీ శంకర్ పట్టుబట్టడంతో కథ విని మనసు మార్చుకున్నాడట. ఆ నిర్ణయమే తన జీవితాన్ని మార్చేసిందని భావోద్వేగానికి గురయ్యాడు. 1993లో విడుద లైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

Tags:    

Similar News