Festival for Mega Fans: ఆగస్టు 22న మెగా ఫ్యాన్స్ కే పండగే..
మెగా ఫ్యాన్స్ కే పండగే..;
Festival for Mega Fans: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 అభిమానులకు ఈసారి డబుల్ ట్రీట్ కాకుండా ఏకంగా నాలుగు సినిమా అప్‌డేట్‌లు రాబోతున్నాయి.
వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్, విడుదల తేదీని చిరంజీవి పుట్టినరోజున ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ఆగస్టు 22న అధికారికంగా వెలువడుతుంది. దీనికి 'మనా శివశంకర వర ప్రసాద్' అనే పేరు పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.
వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీతో చిరంజీవి మరో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కూడా పుట్టినరోజున ప్రకటించే అవకాశం ఉంది. అలాగే దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి 158వ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా పుట్టినరోజున రావచ్చు.
వీటన్నింటితో పాటు, చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్రను ఆగస్టు 22న రీ -రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఇది మెగా అభిమానులకు మరో పెద్ద పండగ అని చెప్పవచ్చు.