Actress Rashmika Mandanna: ఇన్ స్టాలో రష్మిక పోస్ట్ సరికొత్త రికార్డ్..కోహ్లీ రికార్డ్ బ్రేక్

కోహ్లీ రికార్డ్ బ్రేక్

Update: 2026-02-28 14:32 GMT

Actress Rashmika Mandanna: రష్మిక మందన్న,విజయ్ దేవరకొండ పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించాయి.ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను రష్మిక పోస్ట్ చేయగా, అవి కేవలం 48 గంటల్లోనే 23 మిలియన్ల (2.3 కోట్లు) లైకులు(ప్రస్తుతం 23.9 మిలియన్లుగా ఉంది) సాధించాయి. దీనితో భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యధిక లైకులు పొందిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా ఇది రికార్డు సృష్టించింది.

2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్‌కు 22.8 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇప్పుడు రష్మిక ఆ రికార్డును దాటేసి నంబర్ 1 స్థానానికి చేరుకుంది. వీరిద్దరి పెళ్లి ఫోటోలకు కలిపి (రష్మిక పోస్ట్ + విజయ్ పోస్ట్) దాదాపు 41 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.గతంలో సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ (16M+), ఆలియా భట్ - రణబీర్ కపూర్ (13M+) వంటి వారి రికార్డులను ఈ జంట భారీ మార్జిన్‌తో అధిగమించింది.

మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లి రాజస్థాన్‌లో జరిగినప్పటికీ, టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ వేడుకను ప్లాన్ చేశారు. మార్చి 4న తాజ్ కృష్ణలో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ఉద్ధండులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News