Avatar 3 First Look Unveiled: అవతార్ 3 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రిలీజ్ ఎపుడంటే.?
రిలీజ్ ఎపుడంటే.?;
Avatar 3 First Look Unveiled: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రం అవతార్ 3 నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. అవతార్: ఫైర్ అండ్ యాష్ పేరుతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జులై 19న టీజర్, 2025 డిసెంబర్ 19న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అవతార్ 3లో అగ్ని (Fire) మూలకం ప్రధానంగా ఉంటుంది. గత చిత్రాలలో భూమి (మొదటి భాగం),నీరు (రెండవ భాగం) ప్రధానంగా ఉండగా, ఇప్పుడు మూడవ భాగం అగ్ని నేపథ్యంలో రాబోతుంది.ఈ చిత్రంలో విండ్ ట్రేడర్స్ అనే మరో కొత్త తెగను కూడా పరిచయం చేయనున్నారు.ఈ సినిమా పండోరా గ్రహంలో మనుషులు సృష్టించే విధ్వంసాన్ని, దానిని అడ్డుకునే పండోరా తెగల సాహసాలను చూపిస్తుంది.
దాదాపు రూ. 2200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 భాషల్లో విడుదల కానుంది. అవతార్ ఫ్రాంచైజీలో అవతార్ 4, 2029లో, అవతార్ 5 2031లో విడుదల కానున్నాయి.