Sharwanand’s ‘Bhogi’: రక్షా బంధన్‌‌కు శర్వానంద్ భోగి

శర్వానంద్ భోగి

Update: 2026-02-26 06:45 GMT

Sharwanand’s ‘Bhogi’: శర్వానంద్ హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. గుబురు మీసం, చేతిలో పదునైన ఆయుధంతో మాస్‌‌ లుక్‌‌లో ఫెరోషియస్‌‌గా శర్వానంద్ కనిపిస్తున్నాడు. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని, ఇందులోని ప్రతి ఫ్రేమ్‌‌లోనూ శర్వా బీస్ట్ మోడ్‌‌లో కనిపిస్తాడని మేకర్స్‌‌ చెబుతున్నారు.

1960 నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్‌‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్‌‌, డింపుల్‌‌ హయతి నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రాఫర్. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌‌ చేయబోతున్నట్టు మేకర్స్‌‌ ప్రకటించారు.

Tags:    

Similar News