‘Avatar 3’ OTT Release Date Locked: అవతార్-3 ఓటీటీ డేట్ ఫిక్స్.. ఇక ఇంట్లోనే పండోరా ప్రపంచం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Update: 2026-05-13 13:47 GMT

‘Avatar 3’ OTT Release Date Locked: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం అవతార్-3: ఫైర్ అండ్ యాష్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు వస్తోంది.

జూన్ 24 నుంచి ఉచితంగా..

ప్రస్తుతం ఈ సినిమా కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కేవలం 'రెంటల్' (అద్దె) ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. అయితే జూన్ 24వ తేదీ నుండి అంతర్జాతీయంగా డిస్నీ ప్లస్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. దీంతో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఈ విజువల్ వండర్‌ను వీక్షించవచ్చు.

ఇండియాలో ఎక్కడ చూడొచ్చు?

భారతదేశంలో ఈ చిత్రం జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 24న విడుదలయ్యే అవకాశం ఉంది. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, సినీ ప్రియులు అప్పుడే సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు.

ఫైర్ అండ్ యాష్ ప్రత్యేకత

అవతార్ సిరీస్‌లో వచ్చిన ఈ మూడవ భాగం పండోరా గ్రహంపై మునుపెన్నడూ చూడని యాష్ పీపుల్ ను పరిచయం చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఆ అద్భుత ప్రపంచాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Tags:    

Similar News