Baaghi 4 Teaser Released: యానిమల్ ను మించేలా..బాఘీ 4 టీజర్ రిలీజ్
బాఘీ 4 టీజర్ రిలీజ్;
Baaghi 4 Teaser Released: టైగర్ ష్రాఫ్ నటించిన 'భాఘీ 4' టీజర్ ఇటీవల విడుదలైంది. ఇది ఈ ఫ్రాంఛైజీలో అత్యంత క్రూరమైన హింసాత్మకమైన సినిమాగా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. 'భాఘీ' సిరీస్‌లో ఇది మొదటిసారిగా 'A' రేటింగ్ పొందిన చిత్రం కావడం విశేషం.
రాన్ అనే తన పాత్రలో టైగర్ ష్రాఫ్ మరింత రఫ్, అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రతీకారంతో రగిలిపోయే అతని పాత్ర, పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. "హర్ ఆషిక్ ఏక్ విలన్ హై" (ప్రతి ప్రేమికుడు ఒక విలనే) అనే అతని డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఇందులో సంజయ్ దత్ ఒక క్రూరమైన విలన్‌గా కనిపించాడు. అతని మెనసింగ్ స్క్రీన్ ప్రెజెన్స్,ఉన్మాదంతో కూడిన నటన టీజర్‌కు మరింత ఆసక్తిని పెంచింది. ఒక సన్నివేశంలో తెగిన చేయితో సిగార్ వెలిగించడం వంటి హింసాత్మక దృశ్యాలు ఈ సినిమాలోని వైలెన్స్‌ను సూచిస్తున్నాయి.
ఇందులో సోనమ్ బజ్వా, మాజీ విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. టీజర్‌లో వారు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపించారు.టీజర్ నిండా హింసాత్మకమైన యాక్షన్ సన్నివేశాలు, రక్తం, విలన్ల మీద రాన్ ప్రతీకారం వంటి అంశాలు ఉన్నాయి. ఈ సినిమాని చూసిన చాలా మంది ఇది రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమాను గుర్తుచేస్తోందంటున్నారు. భాఘీ 4 సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది.