Akhanda 2: అఖండ-2లో భజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ

భజరంగీ భాయీజాన్ ఫేమ్ హర్షాలీ;

Update: 2025-07-03 16:19 GMT

Akhanda 2:  సల్మాన్ ఖాన్ భజరంగీ భాయీజాన్ సినిమాలో మున్ని పాత్రలో నటించి మెప్పించిన హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, -బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతోన్న అఖండ-2లో ఆమె 'జనని' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ పోస్టర్ను విడుదల చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకిరానుంది.

ఈ సినిమాను దర్శకడు బోయపాటి శ్రీను తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర బోయపాటి,- బాలయ్య కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

ముంబయికి చెందిన హర్షాలీ మల్హోత్రా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించారు. 2015లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ బాయిజాన్ సినిమాలో మున్నీ రోల్‌లో నటించింది. బధిర బాలిక పాత్రలో ఆమె తన నటనతో చెరగని ముద్ర వేశారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సల్మాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించింది. హర్షాలీ నటనకు మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.

Tags:    

Similar News