Remuneration Race Heats Up: నయనతారకే షాక్ ఇచ్చిన కియారా.. పారితోషికం విషయంలో పోటాపోటీ!

పారితోషికం విషయంలో పోటాపోటీ!

Update: 2026-02-25 05:35 GMT

Remuneration Race Heats Up: దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా నయనతారకు ఎప్పటి నుంచో మంచి గుర్తింపు ఉంది. ఆమె తన రెమ్యూనరేషన్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారని, నిర్మాతలు అడిగినా తగ్గించుకోవడానికి పెద్దగా ఇష్టపడరని టాక్. అయితే ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా బడ్జెట్ దృష్ట్యా నిర్మాతలు కోరగా, మొదట ఒప్పుకోకపోయినా చివరికి నయనతార తన ఫీజును తగ్గించుకున్నారట. సాధారణంగా ఆమె రూ. 10 కోట్లు (ప్లస్ GST) తీసుకుంటుండగా, ఈ సినిమా కోసం రూ. 8 కోట్లకు అంగీకరించినట్లు సమాచారం.

అయితే రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న పాన్-ఇండియా చిత్రం "టాక్సిక్" (Toxic) విషయంలో మాత్రం లెక్కలు మారినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో నయనతార యశ్ సోదరి పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం కియారా అద్వానీ.. నయనతార కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందట. నయనతారకు సుమారు రూ. 10 నుండి 12 కోట్లు ఇస్తుండగా, కియారా ఏకంగా రూ. 15 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కియారా గతంలో రామ్ చరణ్ సినిమా "గేమ్ ఛేంజర్" కోసం సుమారు రూ. 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దానితో పోలిస్తే "టాక్సిక్" కోసం ఆమె తీసుకుంటున్న మొత్తం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ క్రేజీ గ్యాంగ్‌స్టర్ డ్రామా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News